రాజకీయ కురువృద్ధుడు,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్య పరిస్ధితిపై అయోమయం నెలకొంది. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరిన కరుణానిధికి ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసిన డాక్టర్లు పరిస్ధితి విషమించిందని తెలిపారు. నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తున్నారని తెలిపారు. మరోవైపు డీఎంకే శ్రేణులు అందుబాటులో ఉండాలని స్టాలిన్ చెప్పడంతో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. కార్యకర్తలు సంయమనం పాటించాలని స్టాలిన్, అళగిరి శ్రేణులకు విజ్ఞప్తి
చేశారు.
కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పరామర్శించారు. స్టాలిన్, కుమార్తె కనిమొళితో మాట్లాడారు. కరుణానిధి ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు కరుణానిధి ఆస్పత్రిలో ఉన్న సమాచారం తట్టుకోలేక మరో ఇద్దరు డీఎంకే కార్యకర్తల గుండెలు ఆగాయి. శివగామినగర్‌కు చెందిన డీఎంకే కార్యకర్త రాజు(60) మనో వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు.