కరుణానిధి అంత్యక్రియలు పూర్తి..

328
Karunanidhi cremated
- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని అన్నా స్వ్కేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థివ దేహాన్ని ఖననం చేశారు.

Karunanidhi cremated

డీఎంకే అధినేత కరుణానిధి అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చెపాక్ స్టేడియం, శివానంద రోడ్, తంతైపెరియార్ రోడ్డు మీదుగా మెరీనా బీచ్ కు చేరుకుంది. డీఎంకే శ్రేణులు, అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి.

కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ నేత గులాంనబీ ఆజాద్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, వివిధ పార్టీల నేతలు అంతిమ యాత్రలో పాల్లోన్నారు.

- Advertisement -