‘వామ్మో బామ్మ’ మూవీ ఆడియో‌..

336
Vaammo Baammo Movie Audio Release

అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో విజయ్ ఆనంద్ దర్శకత్వంలో సి హెచ్ వెంకటేశ్వర రావు మరియు శ్రీమతి జి సంధ్య రెడ్డి నిర్మాతలుగా శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘వామ్మో బామ్మ’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మరియు పాటలు ఈ రోజు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ప్రముఖ నిర్మాతలు సాయి వెంకట్ మరియు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధులుగా విచ్చేసి ఈ సినిమా లోని పాటలు మరియు ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం యొక్క ఆడియో కీ (KEE) మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నారు. ‘వామ్మో బామ్మ’ ఒక కామెడీ హారర్ ఎంటర్టైనర్. సీనియర్ నటీమణి శ్రీలక్ష్మి ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు.

Vaammo Baammo Movie

ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ.. “సీనియర్ నటులు శ్రీలక్ష్మి ఈ సినిమా లో నటించటం మాకు ఒక్క గొప్ప వరం. సినిమాలో తానే హీరో. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. అనుకున్నదానికంటే సినిమా చాల బాగా వచ్చింది. మా నిర్మాతలు సి హెచ్ వెంకటేశ్వర రావు మరియు శ్రీమతి జి సంధ్య రెడ్డికి నా కృతజ్ఞతలు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాము” అని అన్నారు.

సాయి వెంకట్ మాట్లాడుతూ “ఈ సినిమాకి శ్రీలక్ష్మియే హీరో. బామ్మ గా అద్భుతంగా నటించారు. సినిమా నేను చూశాను. చాల బాగుంది సినిమా. సంగీత దర్శకుడు ఆదిత్య అందించిన పాటలు చాలా బాగున్నాయి. దర్శకుడు విజయ్ ఆనంద్ చాల బాగా తీశారు. చిన్న సినిమాలు విడుదల చేయటం చాలా కష్టం కానీ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మంచి ఆఫర్ వస్తుంది. ఈ సినిమా మంచి విజయం కావాలి ” అని కోరుకున్నారు.

Vaammo Baammo Movie

తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ “దర్శకుడు విజయ్ ఆనంద్ నా సినిమాలకి రైటర్‌గా పనిచేశాడు. ఈ సినిమా ఆడియో కీ (KEE) మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. నా సినిమా ఐస్ క్రీం కూడా ఆ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైంది. హీరో కిరణ్ మంచి మిత్రుడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీశారు. శ్రీలక్ష్మి ఈ చిత్రానికి ఒక్క హైలైట్‌గా నిలుస్తారు. గతంలో బామ్మ మాట బంగారు బాట మంచి విజయం సాధించింది ఇప్పుడు ఈ సినిమా ‘వామ్మో బామ్మ’ అంతటి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

సీనియర్ నటులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ “ఈ సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. డైరెక్టర్ చాలా కస్టపడి చేశారు. వన్ మాన్ ఆర్మీగా తానే అంత చూసుకున్నాడు. మంచి చిత్రం కుటుంబ సభ్యలు అందరు కలిసి చూడదగ్గ చిత్రం. ఈ సినిమా విజయవంతం కావాలి” అని కోరుకున్నారు.

Vaammo Baammo Movie

హీరో కిరణ్ మాట్లాడుతూ “ఈ రోజుల్లో చిన్న సినిమా కష్టాలు అందరికి తెలుసు. అవకాశం దొరకటమే చాలా కష్టం. ఇప్పుడు మా సినిమా ‘వామ్మో బామ్మ’ త్వరలో విడుదల అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. శ్రీలక్ష్మితో నటించటం నా అదృష్టం. సినిమా మంచి విజయం సాదించాలి” అని తెలిపారు.. హీరోయిన్ ఆశ్లేష మాట్లాడుతూ “నాకు చాలా సంతోషం గా ఉంది సినిమా రిలీజ్ అవుతుంది అని. నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను. సినిమా చాలా కస్టపడి చేసాం. మీఅందరికి నచుతుంది అని అనుకుంటున్నాను” అని తెలిపారు.

నటినటులు: హీరో: కిరణ్, హీరోయిన్: ఆశ్లేష, శ్రీలక్ష్మి, మంజీరా, కిట్టు, వెంకట్, నరసింహ రావు, గబ్బర్ సింగ్ గ్యాంగ్, సంగీతం : ఆదిత్య, సాహిత్యం : శ్రీసాధనల వెంకట స్వామి నాయుడు, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్: నెల్వ కుమార్, డాన్స్: కపిల్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ రాజశేఖర్, దర్శకుడు: విజయ్ ఆనంద్, నిర్మాతలు: సి హెచ్ వెంకటేశ్వర రావు మరియు శ్రీమతి జి సంధ్య రెడ్డి, బ్యానర్: శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్స్.