వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాలేకపోయిన విషయం పై కరుణ్ నాయర్ స్పందించారు. సెలెక్టర్లను అడగండి అని సూచించారు. ఇటీవల వెస్టిండీస్‌పై టూర్‌కు భారత జట్టును ప్రకటించగా 15మంది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌లకు ఎంపికైన నాయర్, సిరీస్‌ను 25.62 సగటుతో ముగించాడు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 205 పరుగులు మాత్రమే చేసినా, ది ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో కీలకమైన హాఫ్ సెంచరీ సాధించాడు.
బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, జట్టు మేనేజ్‌మెంట్‌కి నాయర్ నుండి మరింత బలమైన ప్రదర్శన కావాల్సిందని, అందువల్ల దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేసుకున్నామని తెలిపారు. తాను ఎంపిక కాకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేసిన నాయర్, ఎందుకు తాను తప్పించబడ్డాడనే ప్రశ్నకు సెలెక్టర్లే సమాధానం చెప్పగలరని అన్నారు. ది ఓవల్‌లో తన హాఫ్ సెంచరీ ప్రాముఖ్యతను కూడా వివరించారు.
తాను జట్టుకు ఎంపిక అవుతానని ఆశించాను. ఏమని చెప్పాలో తెలియడం లేదు. మాటలు రావట్లేదు. నేను ఎక్కువ కామెంట్స్ చేయదలచుకోలేదు. ఇది నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పారు. సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో వారినే అడగాలి. ఒక్కటే చెప్పగలను, చివరి టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఎవరికీ సాధ్యం కానప్పుడు నేను 50 పరుగులు చేశాను. దాంతో జట్టుకు నేను సహాయం చేశానని అనుకున్నాను, ముఖ్యంగా మేము గెలిచిన ఆ చివరి మ్యాచ్‌లో. కానీ, ఇది ఇలాగే ఉంటుంది. అవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు అన్నారు.
Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..హై అలర్ట్

