ఇట్స్‌ హానర్‌ టూ మీట్‌ యూ సర్‌ : చందూ!

78
chandu
- Advertisement -

బాహుబలి, పుష్ప తర్వాత బాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న సినిమా కార్తికేయ2. విడుదలైన ప్రతి చోటా అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. హిందీలో లాల్‌సింగ్‌ చడ్డా, రక్షాబంధన్‌ సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ విజయంతో మాంచి ఊపు మీదున్న డైరెక్టర్ చందూ మెుండేటికి ఊహించని సంఘటన ఎదురైంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ కలిసే అవకాశం వచ్చింది. తాజాగా బిగ్ బీ ‘కార్తికేయ’ చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడు చందూ మొండేటిని స్వయంగా పిలిచి అభినందనలు తెలియజేశారు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. బిగ్ బీని కలవడం జీవితంలోని మరచిపోలేని సంఘటన అని ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నిఖిల్, అనుపమ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 13న రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. కార్తికేయ 2 సినిమాకు క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది.

- Advertisement -