కార్తికేయ-2 బాలీవుడ్‌లో గ్రాస్‌రేట్‌ ఫుల్‌

118
karthikeya
- Advertisement -

బాహుబ‌లి, పుష్ప, ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్‌2 త‌ర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న చిత్రం కార్తికేయ‌-2. నిఖిల్ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. నిఖిల్ కెరీర్‌లోనే హైయెస్ట్‌ క‌లెక్ష‌న్‌ల‌ను సాధించిన చిత్రంగా కార్తికేయ‌-2 నిలిచింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు 100కోట్ల‌కు పైగా గ్రాస్‌ను.. 50కోట్ల‌కు పైగా షేర్‌ను సాధించింది. దీంతో ఈ చిత్రంతో నిఖిల్ వంద కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టాడు. కేవ‌లం తెలుగులోనే కాకుండా విడుద‌లైన ప్ర‌తి భాష‌లోనూ ఈ చిత్రం డ‌బుల్ బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది.

అడ్వేంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిఖిల్‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. కార్తికేయ‌-2 చిత్రం బాలీవుడ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 30కోట్ల నెట్ క‌లెక్ష‌న్‌ను సాధించింది. ఎలాంటి ప్ర‌మోష‌న్‌లు చేయ‌కుండా ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్ష‌న్లు సాధించ‌డం విశేషం అనే చెప్పాలి.

- Advertisement -