అజిత్‌కు విల‌న్‌గా ఆర్ఎక్స్ 100 హీరో.. లుక్‌ రిలీజ్‌..

49

ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌స్తుతం రాజా విక్ర‌మార్క అనే సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. దీంతో పాటు ఈ యంగ్‌ హీరో.. అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న’వాలిమై’ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అయితే ఈ రోజు కార్తికేయ బ‌ర్త్ డే కావ‌డంతో ఆయ‌న‌కు సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ..వాలిమై టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఈ పోస్టర్‌లో కార్తికేయ చాలా రఫ్ అండ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ భామ హుమా ఖురేషి మరొక కీలక పాత్ర లో నటిస్తున్నారు. బోని కపూర్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.