సరైన కథలను ఎంచుకుంటూ తమిళ్ , తెలుగులో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు హీరో కార్తీ. వరుస హిట్లతో బాక్సాఫిస్ వద్ద దూసుకుపోతున్నాడు. తెలగు లో కూడా కార్తి చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈమధ్యకాలంలో కార్తి హీరోగా వచ్చిన సినిమా ఖాకీ. తెలుగు, తమిళ్ లో ఈసినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.
ప్రస్తుతం కార్తీ చేస్తోన్న సినిమా చినబాబు. ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చిత్రబృందం. తమిళంలో కార్తీ హీరోగా దర్శకుడు పాండిరాజ్ ఈసినిమాను తెరకెక్కించారు. తమిళంలో కడైకుట్టి సింగం పేరుతో ఈచిత్రాన్ని విడుదల చేయగా..తెలుగులో చినబాబు అనే టైటిల్ ను ఖరారు చేశారు.
వచ్చే నెల 13వ తేదిన ఈసినిమాను తమిళ్ లో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. కార్తి సరసన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించింది. ఈచిత్రంలో కార్తి రైతుగా కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యం..రైతులు ఎదుర్కోనే సమస్యలపై ఈసినిమా కొనసాగనుంది. భారీ బడ్జెట్ తో ఈమూవీని తెరకెక్కించారు. ఈసినిమాకు నిర్మాతగా హీరో సూర్య వ్యవహరించగా..ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తెలుగులోకి తీసుకురానున్నాడు.