ఆగని ‘కార్తికేయ‌-2’ దండ‌యాత్ర‌ !

88
karthikeya 2
- Advertisement -

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఆగ‌స్టు13న‌ విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతుంది. బాలీవుడ్‌లోనూ సత్తాచాటుతూ దూసుకుపోతోంది.

బాలీవుడ్‌లో మొద‌టి రోజు కేవ‌లం 50 స్క్రీన్‌ల‌లో విడుద‌లకాగా రెండో రోజు రెండో రోజు నుండి స్క్రీన్ల కౌంట్ పెరుగుతూ శుక్ర‌వారం ఏకంగా 1000 పైగా స్క్రీన్‌ల‌లో 3000 పైగా షోస్‌లతో ప్ర‌ద‌ర్శితమ‌వుతుంది. కంటెంట్ ఉన్న సినిమాల‌ను భాష‌తో సంబంధంలేకుండా ప్రేక్ష‌కులు ఆధ‌రిస్తార‌ని కార్తికేయ‌-2 మ‌రోసారి నిరూపించింది.

నిఖిల్ సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ హీరోయిన్‌గా న‌టించగా బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని భారీ వసూళ్లను సాధిస్తోంది.

- Advertisement -