జూలై 22న ‘కార్తికేయ – 2’

66
karthikeya 2
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో నిఖిల్. అర్జున్ సురవరం తర్వాత ప్రస్తుతం ’18 పేజెస్’ షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత చందూ మొండేటితో కలిసి ‘కార్తికేయ 2’ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల్లోను కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కావడం విశేషం.

క్రేజీ ప్రొడక్షన్ హౌసెస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి. జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిఖిల్, చందు మొండేటి కాంబో వచ్చిన ‘కార్తికేయ’ చక్కని విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్ మీద కూడా సామాన్య ప్రేక్షకులలో, పరిశ్రమ వర్గాలలో ఆసక్తి నెలకొంది.

తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్‌. జూలై 22న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారక, ద్వాపర యుగాలకు ఈ చిత్రంతో సంబంధం ఉందని తాజాగా విడుదల చేసిన పోస్టర్ బట్టి అర్థమౌతోంది. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

- Advertisement -