- Advertisement -
యువ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం కార్తికేయ -2. కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారరైంది.
తొలుత జూలై 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. తాజాగా ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. నిఖిల్ సరసన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, శ్రీనివాస్ రెడ్డి, అనుపమ్ ఖేర్, హర్ష తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను టిజి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
- Advertisement -