లైగర్ ఎఫెక్ట్..కార్తీకేయ2కి తిరుగులేదు!

18
nikhil
- Advertisement -

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం కార్తీకేయ 2. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టగా బాలీవుడ్‌లోనూ సత్తాచాటింది. దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్‌ మార్క్‌ని చేరుకుంది. అయితే లైగర్ సినిమాతో కార్తీకేయ 2కి బ్రేకులు పడ్డట్లేనని అంతా అనుకోగా ఎవరూ ఊహించని విధంగా కార్తీకేయ2కి మళ్లీ వసూళ్లు పెరిగాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్‌. మాస్ ప్రేక్ష‌కుల‌ను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోళ్తాకొట్టింది. తొలి రోజు తొలి షో నుండే నెగటివ్ టాక్ రావడంతో వసూళ్లు తగ్గుముఖం పట్టాయి.

ఈ నేపథ్యంలో కార్తికేయ2 వసూళ్లు మళ్లీ పెరిగాయి. దీంతో ఈ వీకెండ్ మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -