కెనడాలో ఘనంగా కార్తీక దీపం వేడుకలు

225
karthikkadeepam
- Advertisement -

శ్రీ అనఘా దత్త సొసైటీ వారి ఆధ్వర్యంలో కెనడా కాల్గరీ సాయి బాబా మందిరం లో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి . భగవన్నామ స్మరణ కీర్తనలతో, ధూప, దీప నైవేద్యాలతో వేడుకలు కన్నుల పండుగగా చూపరులను ఆకట్టుకొంది. వెయ్యికి పైగా  దీపాలు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలతో ప్రారంభమయ్యి, భగవన్నామస్మరణలు, పూజలు, హారతులతో దైవ ప్రాంగణం  అలంకారాలతో కనులవిందుగా నెలకొంది. మధ్యాన్నహారతి, రుద్ర హోమం, కార్తీక పూర్ణిమ సత్యనారాయణ వ్రతం, జరుపబడింది.

ఆలయ ప్రధాన అర్చకులు పండిట్ రాజకుమార్ శర్మ గారి విశేషానుభవం తో దేవ, దేవి అలంకారాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడింది.  పండిట్ రాజకుమార్ శర్మ గారు కార్తీక దీప విశేషాన్ని భక్తులకు వివరించారు.

కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా భక్తులు తమ వంతు పూజలకు వేచి, నియమ బద్దత పాటించిన తీరు ఎంతో శ్లాఘనీయమైంది. మందిరం లో శివ, పార్వతి, సాయిబాబా మూర్తులకు అభిషేకం జరిగింది.  నాలుగు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహుకులు శ్రీమతి లలిత, శైలేష్ మరియు చాల మంది వాలంటీర్లతో ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్దగా, నిర్విఘ్నంగా గా నెరవేర్చారు. ఆలయ నిర్వహణ తోట్పాటుకు ఎంతో మంది విరాళాలు సమర్పించారు.

శ్రీమతి లలిత గారు మాట్లాడుతూ – ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన హైందవ సాంప్రదాయ పటుత్వాన్ని నెలకొల్పాలని హిందూ రక్షణ లో భాగం కావాలని కోరుతున్నారు. శ్రీ అనఘా దత్త సొసైటీ అఫ్ కాల్గరీ ఒక హిందూ రక్షణ సమితి.  హైందవ సాంస్కృతిక సంగీతము, భరతనాట్యము, క్లాసికల్ ఆర్ట్స్ మరిన్ని శాఖల పరిరక్షణ కి  ఆయువు పట్టు అన్నారు.

- Advertisement -