నిన్ను కోరి రిమేక్ రిలీజ్‌కు రెడీ!

99
ninnukori
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నిన్ను కోరి. ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని మలయాళంలో రీమేక్ చేయనుండగా అధర్వ మురళి, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్నారు.

ఆర్‌.కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘తల్లిపోగాదే’ అనే టైటిల్‌ ఖరారు చేయగా డిసెంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఫిబ్రవరిలోనే విడుదలకు సిద్ధమైన ఈ మూవీ కరోనాతో పాటు వివిధ కారణాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇందులో నరేన్‌, జగన్‌, కాళి వెంకట్‌, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు ఇతర పాత్రలను పోషించారు.

తెలుగులో ఆది పినిశెట్టి పోషించిన పాత్రలో అమితాష్‌ ప్రధాన్‌ నటించారు. గోపీ సుందర్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఛాయాగ్రహణం షణ్ముగ సుందరం.

- Advertisement -