నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టులోని ప్రముఖ శైవ క్షేత్రం పార్వతి సమేత జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంకు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. స్వామి వారి కొనేరులో పుణ్యస్నానాలు చేసి, వివిధ రకాల ప్రమిధల్లో కార్తీక దీపాలు వెలిగించారు భక్తులు. స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పట్టింది.
భక్తులు స్వామి వారికి సామూహిక అభిషేకాలు,సత్యనారాయణ స్వామి వ్రతాల మండపాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. కార్తీక పౌర్ణమి కావడంతో దేవాలయాన్ని విద్యుత్ లైట్లు, పూలతో అందగా అలంకరించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండ మంచినీటి సౌకర్యం, అదనపు ప్రసాద కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు దేవస్థాన అధికారులు.
స్వామి వారికి తెల్లవారుజామున మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం నిర్వహించారు అర్చకులు. మధ్యాహ్నం జరిగే మాసకల్యాణం, సాయంకాలం జ్వలతోరణం, రాత్రి కార్తీక పురాణ ప్రవచనాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.