పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఇందుకోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
Also Read:ధర్మేంద్ర మృతి చెందలేదు:ఇషా డియోల్
దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, లోపల, బయట క్యూలైన్లలోని సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

