కార్తీకదీపం..వంటలక్క స్కెచ్‌కు మోనిత షాక్..!

286
vantalakka
- Advertisement -

బుల్లితెర పాపులర్ సీరియల్ కార్తీక దీపం 1084 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 1084 ఎపిసోడ్‌లో వంటలక్క స్కెచ్‌కు మోనిత ఆశలన్నీ ఆవిరయ్యాయి. కార్తీన్‌ని దక్కించుకోవాలని మోనిత కన్న కలలపై నీళ్లు చల్లింది వంటలక్క(దీప). దీంతో సీరియల్‌పై మరింత ఆసక్తి పెరిగిపోయింది.

మోనితతో పెళ్లి గురించి దీప ముందు తన బాధను వెళ్లబోసుకుని అక్కడి నుండి కార్తీక్ వెళ్లి పోగా….ఆ రాత్రి మోనిత ఇంట్లో నిద్రపోవడం గురించి తలుచుకుంటాడు. ఏం జరిగిందో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాడు. తాగి తప్పు చేశానంటే నమ్మలేకపోతున్నాను.. మోనితేమో తాగినప్పుడే జరిగింది అంటోంది. మోనితలా మొత్తం గుర్తు లేకపోయినా.. కనీసం కొంచెమైనా గుర్తుకు రావాలి కదా అంటూ ఆలోచిస్తుంటాడు కార్తీక్.

ఇంతలో సౌందర్య…దీపకు ఫోన్ చేసి కార్తీక్ కలిసిన విషయాన్ని చెప్పడమే కాదు…తనకేం తెలియదంటూ కార్తీక్ చెప్పిన విషయాన్ని చెబుతుంది. అయితే దీప మాత్రం ఆ మాటలను నమ్మకపోగా వెటకారంగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తుంది. అయితే తర్వాత మోనిత చేసిన వీడియో కాల్‌లో కార్తీక్ కనిపించడం గురించి, కార్తీక్ ఏడుస్తూ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కాలో ప్లాన్ వేస్తుంది. అయితే మొత్తంగా వంటలక్క వేసే స్కెచ్‌తో మోనితకు గట్టిగా షాక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

పిల్లలను తినడానికి పిలవగా డాడీ వచ్చే దాకా తినను అనడంతో.. ‘మీ డాడీ రావడానికి లేట్ అవుతుంది’ అంటూ అబద్దం చెబుతుంది దీప. సరిగ్గా అప్పుడే కార్తీక్ రావడంతో దీప షాక్ తింటుంది. దీంతో పిల్లలు ప్రశ్నలు వేస్తుండగా మళ్లో అబద్దం చెప్పి కవర్ చేయడానికి ప్రయత్నం చేయగా కార్తీక్ ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తర్వాత పరిస్ధితి చల్లబడి అంతా కలిసి తింటుండగా కార్తీక్, దీపలు పిల్లల కోసం నవ్వుతూ నటిస్తుంటే సీన్ ఆసక్తిగా ఉంటుంది.

ఇక మోనితతో జరిగిన తప్పు గురించి తెగ ఆలోచించిన కార్తీక్ ఓ నిర్ణయానికి వస్తాడు. ఈ జీవితం నాది.. నా వ్యక్తిత్వం వేరు.. నా సంస్కారం మీద నాకు నమ్మకం ఉంది.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. ఎందుకు తలదించుకోవాలి?ఎందుకు అపరాదభావంతో కుంగిపోవాలి అంటూ ధైర్యం తెచ్చుకోవడంతో మోనిత ఆశలు అడియాశలు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచిచూడాలి.

- Advertisement -