కార్తీ….ఖాకి ఫస్ట్ లుక్

236
- Advertisement -

భిన్న చిత్రాల ద్వారా తన అభిరుచిని చాటుకుంటూనే మంచి విజయాలు దక్కించుకుంటున్నారు తమిళ నటుడు కార్తీ. ఉపిరి, కాష్మోరా వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ తాజాగా మరోసారి అలరించడానికి సిద్దమవుతున్నాడు. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ధీరన్‌ అధిగరమ్‌ ఒండ్రు’. తెలుగులో ఖాకిగా వస్తున్న ఈ చిత్రం రెండు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

karthi... Khaki FirstLook
2005లో ఓ పత్రికలో ప్రచురితమైన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమా స్క్రిప్ట్‌ కోసం కొంతమంది పోలీసు అధికారులను కూడా వినోద్‌ కలిశారట. కథలో భాగంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్‌ చేశారని తెలుస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అభిమన్యుసింగ్‌ ప్రతినాయకుడు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఫస్ట్ లుక్‌లో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్‌గా చేతిలో గన్ ఉన్న ఫోటో సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఖాకితో కార్తీ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

- Advertisement -