లేడి అమితాబ్ విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా అదే టైటిల్‌తో లేడి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ నయనతార ప్రేక్షకుల ముందుకువచ్చింది.తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? కలెక్టర్‌గా నయన్ ప్రేక్షకులను కట్టిపడేసిందా లేదా చూద్దాం.
కథ:
తన విధి నిర్వహణలో ఒత్తిళ్లకు తలొగ్గని కలెక్టర్ మధువర్షిణి(నయనతార). ఓ గ్రామంలో నీరు పడని బావిలో నాలుగేళ్ళ చిన్నారి పడిపోతుంది. చిన్నారికి కాపాడేందుకు ప్రభుత్వం ముందుకువస్తుంది. జిల్లా కలెక్టర్‌గా ఆమెను కాపాడేందుకు రంగంలోకి దిగుతుంది. అయితే అక్కడ సాంకేతికత,కనీస సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ క్రమంలో నయన్ తీసుకున్న నిర్ణయం ఏంటీ..?చివరికి చిన్నారి ప్రాణాలు కాపాడిందా లేదా అన్నదే కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,కథనం, నయనతార నటన,ఎమోషనల్ సీన్స్. అద్భుత నటనతో నయనతార ప్రేక్షకులను కట్టిపడేసింది. తన కెరీర్‌లో ఓ మైలురాయి పర్ఫార్మెన్స్‌తో తన పాత్రకు ప్రాణం పోసింది. ఎక్కడ తెలుగు నెటివిటి మిస్ కాకుండా దర్శకుడు చూపిన ప్రతిభ అద్భుతం. సినిమా చూసిన ప్రేక్షకుడు కంటతడి పెట్టకుండా ఉండలేడు.మిగితా నటీనటులు కొత్తవారే అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా సహజ నటనతో సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లారు.
మైనస్ పాయింట్స్:
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్స్
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. సినిమాటోగ్రఫీ సూపర్బ్. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా తెరపై తన ప్రతిభను చూపించాడు. జిబ్రాన్ నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తనదైన సంగీతంతో ఎమోషన్‌ను పండించాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ
విలువలు బాగున్నాయి.
తీర్పు:
పేద, బడుగు వర్గాలకు చెందిన వారి జీవితాల్లో ఉండే సమస్యలు,బంధాలు, ఆప్యాయతలను తెరపై చూపించే ప్రయత్నమే కర్తవ్యం. కథ,కథనం,నయన్ నటన సినిమాకు ప్లస్ పాయింట్స్. కేవలం ఒక చోట జరిగే సంఘటనను తీసుకొని రెండు గంటల సేపు ప్రేక్షకుల దృష్టి మరల్చకుండా నడిపించిన దర్శకుడి ప్రతిభకు వంకపెట్టలేం. ఓవరాల్‌గా ప్రతి ఒక్కరికి నచ్చే,నయన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం కర్తవ్యం.
విడుదల తేదీ:16/03/2018
రేటింగ్: 2.75/5
నటీనటులు: నయనతార, విఘ్నేష్
సంగీతం : గిబ్రాన్
నిర్మాత : శరత్ మరార్, ఆర్.రవీంద్రన్
దర్శకత్వం : గోపీ నైనర్