భారీ వర్షాల కారణంగా వాయిదాపడ్డ కర్తార్‌పూర్ కారిడార్ యాత్రం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా రావి నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోవడంతో భారత్ – పాక్ సరిహద్దుల మధ్య వరదలు పోటెత్తాయి. దీంతో యాత్రను నిలిపివేయగా ఇవాళ తిరిగి ప్రారంభించనున్నారు. ఇవాళ మంగళవారం 132 మంది సిక్కు భక్తులు కర్తార్ పూర్ కారిడార్ యాత్రకు పేర్లు నమోదు చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న ఈ గురుద్వారా భారత సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. యాత్రికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా వీటిని సందర్శించడానికి భారత్-పాక్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోగా 2019 నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్ యాత్ర ప్రారంభమైంది.
Also Read:Guava:జామకాయతో ఎన్ని ఉపయోగాలో