క‌ర్రెగుట్ట‌.. 23 మంది మావోల హతం!

16
- Advertisement -

కాల్పుల మోతతో దద్దరిల్లింది కర్రెగుట్ట. తెలంగాణ – ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు 23 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలోనే మృతి చెందగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:సాయుధ బలగాలకు అండగా ఉంటాం: రేవంత్

- Advertisement -