నాగార్జునకు కరోనా భయం..షూటింగ్ వాయిదా

417
nagarjuna

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈమూవీలో నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన ఈమూవీ ఫస్ట్ లుక్ కు అద్బుతమైన స్పందన వచ్చింది.

కాగా ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ ను ఇటివలే పూర్తి చేసుకుంది. త్వరలోనే ధాయ్ లాండ్ లో తర్వాతి షెడ్యూల్ జరుగనుంది. అయితే థాయిలాండ్ దేశంలో పాతిక వరకు కరోనా కేసులు నమోదుకావడం వలన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆ షెడ్యూల్‌ని క్యాన్సిల్ చేశారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాతే థాయ్‌లాండ్ వెళ్లాల‌ని చిత్ర బృందం భావిస్తుంది. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.