కర్ణాటకలో మాటల వార్..!

64
- Advertisement -

కర్ణాటక జరగబోయే ఎన్నికలను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్‌గా భావిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా పార్టీల మధ్య మాటల తూటాల దూసుకుపోతుంటే …మరికొంత మంది ఏకంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల వేడి చల్లారక ముందే మరో నిప్పురవ్వ రాజేసుకుంది.

కర్ణాటకలోని బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే జసనగౌడ పాటిల్ గురువారం ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడూ మోదీ వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. ఇప్పుడు అదే వ్యక్తిని ప్రపంచమంతా కొనియాడుతోంది. ప్రపంచ నేతలు ఆయనతో వేదిక పంచుకోవాడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నారు. అలాంటి వ్యక్తిని విష సర్పంతో పోలుస్తున్నారు. వాస్తవానికి ఈ దేశాన్ని నాశనం చేసింది సోనియా గాంధీనే. ఆమె చైనా పాకిస్థాన్ ఏజెంట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి రాష్ట్రమంతటా చర్చానీయాంశమైంది..

Also Read: కాంగ్రెస్ ను జేడీఎస్ నమ్మట్లేదా ?

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ…బీజేపీ ఒటమి భయంతో ఇలా మాట్లుడుతున్నారని అన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబాన్ని విమర్శించడం ప్రధాని మోదీకి ఆ పార్టీకి అలవాటుగా మారిందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ మాటల యుద్ధం మొదలుపెట్టారు. మరీ ఇవి ఎప్పటివరకూ ఉంటాయి. అధికారం కోసం ఒక పార్టీ మరో పార్టీ అధికారంను ఏవిధంగా నిలబెటుకోవడంలో తెలియడం లేదు. ఏ పార్టీ గెలుస్తుందో మరి కొంత కాలం ఎదురుచూడక తప్పదు.

Also Read: నో డౌట్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు !

- Advertisement -