హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ జోస్యం చెప్పరు. టీఆర్ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన కర్నె…పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. 2018 ఎన్నికల్లో కేటీఆర్ విసిరిన సవాల్‌కు ప్రతి సవాల్ విసిరిన ఉత్తమ్ రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని మాటతప్పారన్నారు.
టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ ఎన్నికలు ప్రాజెక్టులు కడుతున్న పార్టీకి…అడ్డుకుంటున్న పార్టీలకు మధ్య జరుగుతున్నాయని చెప్పారు. రాజకీయాల్లో నిజాయితీతో పనిచేయాలని …ఉత్తమ్ ఆ పని ఎన్నడూ చేయలేదన్నారు.
మూడు పండలకు నీళ్లు ఇస్తున్నఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేశాయని అన్నారు. ఉత్తమ్ కుమార్‌వి ఉత్తర కుమార ప్రగళ్బాలు అన్నారు. ఎన్నికలకు ముందే ఉత్తమ్ ఓటమిని అంగీకరించారని చెప్పారు. పులిచింతల పేరుతో కాంగ్రెస్ నాటకమాడిందని ఆరోపించారు .
మండలి ఛైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఏనాడూ పార్టీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రణరంగంలో వెన్నుచూపి పారిపోతున్నారని మండిపడ్డారు కర్నె.