కర్ణాటకలో శ్వేతనాగు

209
white snake
- Advertisement -

కర్ణాటకలో అరుదైన శ్వేతనాగు కనువిందు చేసింది. అంతర్జాతీయ పాముల దినోత్సవం రోజున కర్నాటకలో దర్శనమిచ్చింది. షిమోగా తాలూక రామేనకొప్ప గ్రామంలోని ఓ తోటలో అరుదైన పాము కనిపించగా.. దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. మూడున్నర అడుగుల పొడువు ఉన్న నాగుపామును స్నేక్‌ క్యాచర్‌ కిరణ్‌ ఆ పామును పట్టుకొని.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే, కర్నాటకలో శ్వేతనాగు కనిపించడం ఇది రెండోసారి. నాలుగేళ్ల కిందట షిమోగాలోని మాండ్లీ సమీపంలోనూ ఒకసారి శ్వేతనాగు దర్శనమిచ్చింది. సాధారణంగా కోబ్రాలు గోధుమ, నలుపు రంగుల్లో ఉంటాయి. చర్మ, రక్త సంబంధిత కారణాలతో తెలుపు రంగులోనూ కనిపిస్తాయని నిపుణులు చెప్పారు.

- Advertisement -