చైతూకి షాకిచ్చిన కన్నడ సర్కార్

133
karnataka
- Advertisement -

హీరో నాగచైతన్యకు షాకిచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ మాస్ అండ్ థ్రిల్లర్ సినిమాని చేస్తున్నారు చైతూ. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతుండగా చిత్రయూనిట్‌కి షాక్ తగిలింది.

కర్ణాటక మేలుకోట సమీపంలో ఆ జిల్లా అధికారుల నుండి షూటింగ్ కి అనుమతులు తీసుకున్నారు చిత్ర యూనిట్. అయితే అక్కడ రాజగోపురం తరహాలో మద్యం విక్రయకేంద్రం సెట్ వేసి, మద్యం సీసాలను ఉంచి చిత్రీకరణ చేస్తుండగా స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గుడిలాగా భావిస్తున్న ప్రదేశంలో మద్యం అమ్మకాలు ఏంటని పోలీసులకు కంప్లైంట్ చేశారు.

దీంతో స్పందించిన కర్ణాటక సర్కార్‌…చిత్రయూనిట్ నిబంధనలను ఉల్లంగించిందని అనుమతులను రద్దు చేశారు. దీంతో షూటింగ్ ఆపేసి వెనక్కిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -