కర్ణాటకలో హైడ్రామా…రాజీనామా చేస్తానన్న స్పీకర్

296
Karnataka Speaker
- Advertisement -

కర్ణాటకలో రోజుకో హైడ్రామా నడుస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చాడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అది రోజు రోజుకు వాయిదా పడుతూనే వస్తుంది. ఇప్పుడు కన్నడ రాజకీయాలు దేశంలోనే హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో బలపరీక్ష నిరూపణకు సిద్దమవ్వగా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో బలపరీక్షకు నేటికి వాయిదా పడింది. నిన్న రాత్రి 10గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

దీంతో నేటి సాయంత్రం 6 గంటల వరకు స్పీకర్ మరో డెడ్‌లైన్ విధించారు. ఆ లోపు కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. నిన్న సాయంత్రం అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. బీజేపీ వ్యతిరేకించినప్పటికీ స్పీకర్ మాత్రం అధికార పక్షానికి మాట్లాడేందుకు పదేపదే అవకాశం ఇచ్చారు.

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్పీకర్‌తో కుమారస్వామి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బలపరీక్షకు రాత్రి 9 గంటల వరకు సీఎంకు స్పీకర్ సమయం ఇచ్చారు. సుప్రీంకోర్టులో తమ పిటిషన్ పెండింగులో ఉన్నందున మరింత సమయం ఇవ్వాలని కోరినా స్పీకర్ నిరాకరించారు. బలపరీక్షకు సిద్ధం కాకపోతే తాను రాజీనామా చేస్తానని కూడా స్పీకర్ హెచ్చరించారు.

- Advertisement -