సీఈసీ పారదర్శకంగా వ్యవహరించాలి

3
- Advertisement -

భారత ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా వ్యవహరించాలి అన్నారు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే. సీఈసీ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లయితే భిన్నాభిప్రాయ లేఖలు ఎందుకు ఉన్నాయి?.. ఏకగ్రీవం అంటే అందరూ ఒకే అభిప్రాయానికి అంగీకరించినట్లు కదా..ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉంటే ముగ్గురూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండాలి అన్నారు.

తాము రాసిన భిన్నాభిప్రాయ లేఖలను ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషనర్లపై ఒత్తిడి వస్తోంది. ఈ లేఖలు కాంగ్రెస్ పార్టీ రాసినవి కావు. ఎన్నికల కమిషనర్లు స్వయంగా రాసినవి. అసలు ప్రశ్న ఏమిటంటే.. ఈ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నారా? లేక ఏకగ్రీవంగా తీసుకున్నారా? కానీ, అధికారిక సమావేశ వివరాల్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొనలేదు కదా అని తెలిపారు.

ఆ సమావేశ వివరాలను పరిశీలించే ఎవరైనా ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు జ్ఞానేశ్ కుమార్ వ్యవహరించిన తీరుతో ఏకీభవించలేదని స్పష్టంగా తెలుసుకోవచ్చు. మరి జ్ఞానేశ్ కుమార్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? రాజ్యాంగబద్ధమైన సంస్థ తరఫున బీజేపీ నాయకులు ఎందుకు సమాధానాలు చెబుతున్నారు?.. జ్ఞానేశ్ కుమార్‌కు న్యాయపరమైన రక్షణ ఎందుకు అవసరం? నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లయితే, ఆయనకు కల్పించిన న్యాయపరమైన రక్షణను తొలగించాలి అన్నారు.

Also Read:తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా?

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌లో తలెత్తుతున్న లోపాలకు ఆదేశాలిచ్చింది ఎవరు?… సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ఎవరు ఆదేశించారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పటికీ సమాధానాలు లేవు అని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు.

- Advertisement -