మావోయిస్టుల కార్యకలాపాలపై అప్రమత్తం:డీజీపీ

35
dgp mahender reddy

మావోయిస్టుల కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన ఫైర్ రేంజ్,పరేడ్ గ్రౌండ్,బీఓఏసీని ప్రారంభించారు మహేందర్ రెడ్డి..

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించాలని చూస్తే వారి చర్యలను తిప్పికొడతామన్నారు. జిల్లా సరిహద్దులో ఉన్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ర్టం నుంచి మావోయిస్టులు చొరబడకుండా ఇక్కడి పోలీసు అధికారులు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వారి చర్యలను నిర్మూలిస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలను ముందుకు తీసుకెళ్తూ, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రజలకు సహకారాన్ని అందిస్తోందన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో స్థానిక యువతకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుంద‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు.