కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

2
- Advertisement -

16 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, చదువుపై ప్రతికూల ప్రభావాలు తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని ప్రకటించారు.

సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న నేపలథ్యంలో చిన్నారుల్లో ఒత్తిడి, వ్యసనపు అలవాట్లు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను వినియోగించకుండా నియంత్రణ చర్యలు తీసుకురానున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.

ఇదే సందర్భంగా సిద్ధరామయ్య రూ.4.20 లక్షల కోట్ల విలువైన భారీ బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ రూపొందించినట్లు ఆయన వివరించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు.

Also Read:రష్యా చమురు కొనుగోలు…భారత్‌కు మినహాయింపు

అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు పెంపు, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం వెల్లడించారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -