కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు విడుదలైన ఇంకా రాజకీయం వేడెక్కుతునే ఉంది. ఓ వైపు నిన్న సీఎం గా బిజెపి ఎమ్మెల్యే యాడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా ఇంకా కాంగ్రెస్ , జేడీఎస్ నేతలు తమ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. రేపు అసెంబ్లీలో బలపరిక్షకు సిద్దపడిన ఇరు పార్టీలు తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. బిజెపి ప్రలోభాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నేతలు అయితే ఏకంగా తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ లోని ఓ హోటల్ లో బస చేయించారు. రాత్రికి రాత్రే బస్సులలో హైదరాబాద్ కు తరలించారు. కాంగ్రెస్ తరపున గెలుపోందిన 78 మంది ఎమ్మెల్యేలలో 76 మంది హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇంకో ఇద్దరు ఎమ్మేల్యేలు అజ్నాతంలో ఉన్నారని సమచారం.
ఇక తమ ఎమ్మెల్యేల ఫోన్ కాల్స్ సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మొబైల్ యాప్ ను ఉపయోగిస్తుంది కార్ణాటక కాంగ్రెస్ పార్టీ. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలను బిజెపి నేతలు సంప్రదించాలంటే ఉన్న ఒక్కమార్గం ఫోన్ కాల్స్ మాత్రమే అందుకే ఈ యాప్ ను వాడుకుంటున్నారు కాంగ్రేస్ నేతలు. బిజెపి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ చేసే ఒకే ఒక పని ఎమ్మెల్యేల ఫోన్ లు తీసుకొవడం. ఇక ఆ పని చేయకుండా అందరి ఫోన్ లలో మొబైల్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొమ్మని చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. వారి ఫోన్ కాల్ సంభాషణను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బిజెపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితే మంత్రి పదవితోపాటు ఆర్ధికంగా ఆదుకుంటామని బిజెపి నేతలు ప్రలోభపెడుతున్నట్లు వచ్చిన ఆడియో టేపులు మీడియాలో ప్రసారమయిన విషయం తెలిసిందే.