Karnataka Elections:బీజేపీకి వరుస షాక్‌లు

65
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్లు దక్కని నేతలు అంతా హస్తం పార్టీలోకి క్యూ కడుతుండగా తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో నిరాశకు లోనైన ఆయన పార్టీని వీడారు.

ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన షెట్టర్‌కి టికెట్ నిరాకరించింది బీజేపీ. ఇక ఈ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. దీంతో ఇండిపెండెంట్‌గా లేదా ఏదైనా పార్టీ నుండి బరిలోకి దిగుతారా అన్నది తెలియాల్సి ఉంది.

ఈ సందర్భంగా బీజేపీ నేతల తీరును తప్పుబట్టారు షట్టర్. బీజేపీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అవమానకరమని..పార్టీ నేతలు తనను కించపరచినందువల్లే తాను రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కొందరు నేతల వల్ల పార్టీ పరిస్థితి దిగజారిందన్నారు. అలాగే ప్రముఖ బీజేపీ నేత బీ సోమశేఖర్‌ సైతం ఆ పార్టీకి రిజైన్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -