సర్వే సంచలనం.. అధికారం ఎవరిదంటే?

66
- Advertisement -

కర్నాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు పట్టుమని 20 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతుంటే.. ఈసారి పక్కా తమదే విజయం అని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు జెడిఎస్ కూడా మేమేం తక్కువ కాదన్నట్లుగా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఇలా ప్రధాన పార్టీల మద్య సాగుతోన్న హోరాహోరీ పోరులో సర్వేలు ఇస్తున్న తీర్పు కొత్త చర్చలకు తావిస్తోంది. తాజాగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన సర్వే ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో ఈసారి ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం రాదని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయాన్ని ఆ సర్వే సంస్థ తేల్చి చెబుతోంది. అంటే అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకోలేదని తాజా సర్వేలో వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ 95-105 స్థానాలు, బీజేపీ 90-100 స్థానాలు, జెడిఎస్ 25-30 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందట. దాంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే చెబుతోంది. ఈ సర్వే ను మార్చి 25 నుంచి ఏప్రెల్ 10 మద్య జరిపినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా చాలా సర్వేలు కూడా హంగ్ ఏర్పడే అవకాశం ఉందనే చెప్పాయి.

మరికొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. ఈ సర్వేలను బట్టి చూస్తే అధికారం కాంగ్రెస్ వైపే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే హంగ్ ఏర్పడడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే ఒకవేళ హంగ్ ఏర్పడితే జెడిఎస్ పార్టీ కింగ్ మేకర్ గా చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే గత 30 ఏళ్ల నాటి నుంచి కర్నాటక ఎన్నికలను పరిశీలిస్తే.. ఏ పార్టీ కూడా రెండవసారి అధికారాన్ని చేపట్టిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి చూస్తే ఈసారి కర్నాటకలో బీజేపీకి గట్టి షాక్ తగలడం ఖాయమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మరి కన్నడ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -