- Advertisement -
కర్నాటక రెబల్ ఎమ్మెల్యే ల పిటిషన్ పై సుప్రీంకోర్టు లో ముగిసిన వాదనలు ముగిశాయి.రేపు ఉదయం 10:30 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మానసం తీర్పు వెల్లడించనుంది.పిటిషనర్ తరుపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించగా … స్పీకర్ రమేష్ కుమార్ తరపున అభిషేక్ సంఘ్వి,సీఎం కుమారస్వామి తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ దవన్ వాదనలు వినిపించారు.
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిలో 10 మంది శాసనసభ్యులు తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించారు. వీరితో పాటు మరో ఐదుగురు కూడా సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు ఈ నెల 18 న కర్నాటక అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది. 18 న ఉదయం 11 గంటలకు బల పరీక్ష నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు.
- Advertisement -