కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.ఉదయం గం.8.00ల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుండగా మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది.కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.మధ్యాహ్నం వరకు స్పష్టం కానుంది కర్ణాటక ప్రజల తీర్పు.
రికార్డ్ స్థాయిలో 73.19 ఓటింగ్ శాతం నమోదు కాగా మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 2,615 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేవని మెజార్టీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
Also Read:కాంగ్రెస్ కు భయం పట్టుకుందా ?
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం. కౌంటింగ్ ప్రక్రియలో 13,309 మంది సిబ్బంది పాల్గోనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తరువాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Also Read:హ్యాపీ బర్త్‌డే…పళనిస్వామి