కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు..

7
- Advertisement -

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది .ఆ పార్టీ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు కలకలం రేపాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వినయ్ కులకర్ణిపై అత్యాచారం, కిడ్నాప్‌, నేర‌పూరిత బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోపణలు రాగా కేసు నమోదు చేశారు పోలీసులు.

34 ఏళ్ల ఓ సామాజిక కార్య‌క‌ర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంజ‌య్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో కేసు బుక్ చేశారు. ఎమ్మెల్యే కుల‌క‌ర్ణి.. ఫోన్‌, వీడియో కాల్స్ చేసి తనను వేధిస్తున్నారని… ఈ కేసులో ఎమ్మెల్యే కుల‌క‌ర్ణిని ఏ1 నిందితుడిగా, అత‌ని అనుచ‌రుడు అర్జున్‌ను ఏ2 నిందితుడిగా పేర్కొన్నారు.

2022లో ఎమ్మెల్యేతో తొలిసారి ప‌రిచ‌యం జ‌రిగింద‌ని, అయితే అప్ప‌టి నుంచి ఆయ‌న త‌న‌కు వీడియో కాల్స్ చేసి అస‌భ్య‌క‌ర‌రీతిలో మాట్లాడుతున్న‌ట్లు ఆ మ‌హిళ ఆరోపించింది. రేప్, కిడ్నాప్‌, సాక్ష్యాల తారుమారు, వేధింపులు, దాడి లాంటి సెక్ష‌న్ల కింద కేసును ఫైల్ చేశారు.

Also Read:సీతారామచంద్ర స్వామి ఆలయంలో జమ్మి చెట్టు

- Advertisement -