బాబుకు కర్ణాటక సీఎం కుమారస్వామి ఝలక్..

254
Karnataka CM H D Kumaraswamy
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుకు కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి ఝలక్ ఇచ్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్ లలోని దోషాల గురించి ఎన్నికల కమిషన్‌తో చర్చించడానికి 21 విపక్షాలు సిద్దం అయ్యాయి. ఇందులో కర్ణటక సీఎం కూడా పాల్లొనవల్సివుండగా తాజాగా ఆయన నిర్ణయం మార్చుకున్నారు.

ఎన్నికల కమిషన్ వద్ద చంద్రబాబుతో నిరసన కార్యక్రమంలో పాల్గొనాలనీ తొలుత నిర్ణయం తీసుకున్న కుమారస్వామి ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలు వల్ల ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక చంద్రబాబు నిరసన కార్యక్రమానికి కుమారస్వామి దూరం అని అందుకే ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించినట్లు సమాచారం.

- Advertisement -