కొలువుదీరిన కుమారస్వామి కేబినెట్..

222
karnataka cabinet
- Advertisement -

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల తర్వాత కుమారస్వామి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన 14 మంది, జేడీఎస్‌కు చెందిన 7 మంది,బీఎస్పీ,కేజీపీ నుంచి చెరొకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన డీకే శివకుమార్,ఆర్‌వీ దేశ్ పాండే,పాటిల్,శివశంకరప్ప,కేజే జార్జ్,బైరి గౌడ,రాజశేఖర్ పాటిల్,శివానంద్ పాటిల్,ప్రియాంక ఖర్గే,కదర్,జమీర్ ఖాన్,పుట్టరంగ శెట్టి,శివశంకర రెడ్డి,శ్యామల ,కేపీజీపీకి చెందిన శంకర్‌ ఉన్నారు. జేడీఎస్ నుంచి హెచ్‌డీ రేవణ్ణ,జీటీ దేవే గౌడ,బండప్ప,పుట్ట రాజు, హెచ్‌కే కుమారస్వామి,మహేష్,ఎన్‌ మహేష్‌,వెంకట్రావ్ నాదగౌడ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రి పదవుల పంపకంలో జేడీఎస్,కాంగ్రెస్‌ మధ్య అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు హోం, నీటి పారుదల, వైద్య-ఆరోగ్యం, వ్యవసాయం, మహిళ శిశు సంక్షేమ శాఖలు సహా 22 మంత్రిత్వ శాఖలు దక్కనున్నాయి. జేడీఎస్ కు ఫైనాన్స్ అండ్ ఎక్సైజ్, పిడబ్ల్యుడి, విద్య, టూరిజం, రవాణ శాఖలు సహా 12 మంత్రిత్వ శాఖలు లభించాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవులు జేడీఎస్ నేతలు తీసుకోగా, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ స్పీకర్ పదవుల్లో కాంగ్రెస్ నేతలు కొలువుదీరారు.

- Advertisement -