కర్నాటక ఎన్నికల్లో వచ్చిన అనూహ్య ఫలితాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీల వైఖరిని పూర్తిగా మార్చేశాయి. అధికారంలో ఉన్న ఒక్క సౌత్ రాష్ట్రం కూడా చేజారిపోవడంతో బీజేపీ పూర్తిగా డీలా పడితే.. ఆ ఎన్నికల్లో గెలిచిన జోష్ తో కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. అయితే కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, స్వయంగా ఆ మద్య హస్తం నేతలే చెప్పడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ను కూలదొసేందుకు సింగపూర్ లో వ్యూహాలు జరుగుతున్నాయని స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మద్య రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో బీజేపీని ఖాళీ చేసేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా బీజేపీకి చెందిన ఎమ్మేల్యేలు సోమశేఖర్, శివరాం వంటి వారు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమౌతున్నారట. వీరి దారిలోనే మరికొంత ఎమ్మేల్యేలు కూడా హస్తం పార్టీ వైపు చూస్తున్నారట. అటు బీజేపీ కూడా కాంగ్రెస్ ఎమ్మెయెలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు చెందిన 40 మంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కమలనాథులు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో పార్టీలోని ఎమ్మెల్యేలు జరిపోకుండా చూడడంతో పాటు బీజేపీలోని ఎమ్మెల్యేలను వీలైనంత మందిని పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది దీంతో బీజేపీ తెరముందు వ్యూహాలు రచిస్తుంటే.. కాంగ్రెస్ తెరవెనుక బీజేపీపై అస్త్రాలు తెలుస్తోంది. మరి ఈ రెండు పార్టీల మద్య జరుగుతున్నా టిట్ ఫర్ ట్యాట్ వార్ లో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందో చూడాలి.
Also Read:Congress:ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వెనుక వ్యూహామదే?