మహిళా ఐపీఎస్‌పై ఎమ్మెల్యే షాకింగ్!

10
- Advertisement -

కర్ణాటకలో ఓ మహిళా ఎస్పీపై నోరు పారేసుకున్నాడు ఓ బీజేపీ ఎమ్మెల్యే. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్‌…కాంగ్రెస్ నేతల ఇంట్లో ‘పెంపుడు కుక్క’లా వ్యవహరిస్తున్నారంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.

ఎస్పీ ఉమా ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం దావణగెరెలోని కేటీజే నగర్ పోలీస్ స్టేషన్‌లో హరీశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దావణగెరెలో రిపోర్టర్స్ గిల్డ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ మాట్లాడుతూ.. నేనొక ఎమ్మెల్యేని. కానీ, ఎస్పీ నన్ను ఏదైనా కార్యక్రమంలో చూస్తే ముఖం చిట్లించుకుంటున్నారు అన్నారు.

అదే కాంగ్రెస్‌కు చెందిన శమనూరు కుటుంబ సభ్యుల కోసం మాత్రం గేటు వద్ద పడిగాపులు కాస్తున్నారు. అచ్చం వాళ్లింట్లోని పోమరేనియన్ కుక్కలా ఆమె ప్రవర్తన ఉంటోంది” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Also Read:GST..ఏఏ వస్తువులపై ఎంతంటే?

- Advertisement -