మద్యం అంశం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేశాయి.
సీనియర్ జేడీ(ఎస్) ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ.. కేవలం ఒక సంవత్సరంలోనే ప్రభుత్వం మూడుసార్లు ఎక్సైజ్ పన్నులను పెంచింది. దీనివల్ల పేద వర్గాల్లోని మద్యం సేవించే ప్రజలకు భారంగా మారుతుందన్నారు. మద్యం సేవించేవారికి కూడా ప్రతివారం ఉచితంగా రెండు మద్యం బాటిల్స్ ను ప్రభుత్వమే సొసైటీల ద్వారా ఎందుకివ్వకూడదంటూ చెప్పారు.
కృష్ణప్ప సూచనపై మంత్రి జార్జ్ స్పందించారు. ఎన్నికల్లో గెలిచి, మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని అలా మీరే చేయండి అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్య నిషేదం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎక్సైజ్ ఆదాయం పేదల నుంచి పీల్చిన రక్తం. ఆ డబ్బు దేశాన్ని నిర్మించదని అన్నారు.
Also Read:రాజాసింగ్‌కు పోలీసుల కీలక సూచన