కన్నడ కంఠీరవ..కుమారస్వామి

210
Karnataka Assembly floor test..congress,jds wins
- Advertisement -

క్షణక్షణం ఉత్కంఠ…గెలుపు మాదంటే మాదేనని ఇరు పక్షాల ధీమా. తొమ్మిదిరోజుల హైడ్రామాకు తెరపడింది. నెంబర్‌ గేమ్‌లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం సాధించింది. సభలో బలం నిరూపించుకోవడం సీఎం యడ్యూరప్ప చతికిలపడ్డారు. డబ్బులు,మంత్రి పదవులను ఎరవేసిన కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలు లొంగలేదు. దీంతో యడ్యూరప్ప అండ్ కో బృందానికి పరాభవం తప్పలేదు. అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేసిన యడ్డీ..సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం 221 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో సాధారణ మెజార్టీ 111. అంటే బీజేపీకి ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌ జేడీఎస్‌కు కలిపి 115 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జేడీఎస్‌తో పొత్తుతో ఎన్నికైన బీఎస్‌పీ ఎమ్మెల్యే కూడా వారికి అండగా నిలిచారు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌, బీఎస్‌పీల కూటమికి 116 మంది ఎమ్మెల్యేల బలం తేలింది. మరో ఇండిపెండెంటు కూడా జేడీఎస్‌- కాంగ్రెస్‌ కూటమికి మద్దతు ఇవ్వడంతో వీరి బలం 117కు
చేరింది.

kumaraswamy

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ వాజుభాయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోరినప్పటికీ గవర్నర్‌ బీజేపీకే అవకాశం ఇవ్వడంతో ఇరు పార్టీల నేతలు సుప్రీంను ఆశ్రయించారు. చివరకు సుప్రీం జోక్యంతో బలపరీక్ష జరుగగా బీజేపీ బలనిరూపణలో విఫలమైంది.

- Advertisement -