పచ్చబొట్టు…దరిచేర్చింది

229
karimnagar
- Advertisement -

చేతిపై ఉన్న పచ్చబొట్టు, అతనివద్ద లభించిన సెల్ ఫోన్ ఆధారంగా రెండు సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్ నుండి తప్పిపోయివచ్చిన వ్యక్తిని గుర్తించి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు గన్నేరువరం పోలీసులు.గన్నేరువరం, గుండ్లపల్లి లోని INDIA1 ATM ను ద్వంసం చేసి దొంగతనానికి యత్నిస్తుండగా CC కెమెరాలో నమోదయిన నిందితుని కోసం కరీంనగర్ కోర్టు వద్ద వెతుకుతుండగా అదే లక్షణాలతో, ఒక మతిస్తిమితం లేని వ్యక్తి కనబడగా అతన్ని పరిశీలించగా అతని చేతి పై ఫోన్ నెంబర్ పచ్చబొట్టు వేయించి ఉన్నాయి.

ఆ పచ్చబొట్టు, అతన్ని తనిఖీ చేయగా లభించిన సెల్ నెంబర్ ఆధారంగా సంప్రదించగా ఆ నెంబర్ మతిస్తిమితం లేని వ్యక్తి అన్న మోసిన్ అలీది అని వాళ్ళు పశ్చిమ బెంగాల్ కు చెందిన వాస్తవ్యులని నిర్ధారణ అయింది. సదరు మతిస్తిమితం లేని యాసిన్ అలీ రెండు(2) సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో తప్పిపోయాడని అతని గురించి వెతుకతున్నామని కుటుంబసభ్యులు తెలిపారు.

వెంటనే హైదరాబాద్ లోని వాళ్ళ బంధువులు కరీంనగర్ కీ బయలుదేరి వచ్చి తీసుకునివెళ్లారు.ఈ సందర్భంగా వారు రెండు(2) సంవత్సరాల క్రితం తప్పిపోయిన మతిస్తిమితం లేని వాళ్ల బందువును అప్పగించిన గన్నేరువరం ఎస్ఐ ఏ తిరుపతి, ఆనంద్ (SB ASI) , A.సంపత్ కుమార్, అలీ లకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -