కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే తలమానికంః మాజీ ఎంపీ వినోద్

432
Former Mp Vinod kumar
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం దేశానికే తలమానికం అన్నారు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ పంప్ హౌజ్ ను మాజీ ఎంపీ వినోద్ పరిశీలించారు. బీజేపీ తెలంగాణ వ్యతిరేకి అన్నారు. బీజేపికి తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

బీజేపీ తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకి అన్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రాజెక్ట్ గురించి లోతుగా తెలుసుకుని వాళ్లు మాట్లాడాలని సూచిస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా త్వరలోనే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా తూములు, కుంటలు స్దిరికరిస్తామని తెలిపారు.

- Advertisement -