మొక్కలు నాటిన కరీంనగర్ డిప్యూటీ మేయర్ దంపతులు….

25
green challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ దంపతులు చల్లా సరూపరాణి-హరిశంకర్ ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజు అవడంతో వారు ఇరువురు కలిసి టిఆర్ఎస్ పార్టీ డివిజన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కెసిఆర్ గారి మానస పుత్రిక తెలంగాణకు హరితహారం కార్యక్రమం 2014 నుంచి ఉదృతంగా జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

దీనికి కొనసాగింపుగా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గత మూడు సంవత్సరాల నుండి చేపడుతున్న కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. దేశం నలుమూలల నుండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ మొక్కలు నాటుతున్నారు.అందులో భాగంగానే వారిద్దరూ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు.

కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్లా విజయ, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరు క్రాంతి & ట్రైనీ IPS ఆఫీసర్ రష్మీ పరుమాల గార్లకి ఛాలెంజ్ చేశారు .అలాగే నా అభిమానులు బంధుమిత్రులు అందరూ పుట్టినరోజు పెళ్లిరోజు సందర్భాల్లో మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.