ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మంగళవారం నాడు కమిషనరేట్ కేంద్రంలో నగర పోలీస్ కమిషనర్ ఎల్ . సుబ్బరాయుడు, ఐ.పి.ఎస్.., మొక్కలు నాటారు . ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ నేటి తరాలకు మొక్కల యొక్క ఆవశ్యకత తెలపవలసిన అవసరం మనపై ఉందని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించుకొనే భాద్యత కూడా మనమే చేపట్టాలి అన్నారు.
అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 6 విడతలలో “ప్లాస్టిక్ బ్యాగులను, ప్లాస్టిక్ సంబందించిన వస్తువులను వాడకూడదు” అనే నినాదంతో, ప్లాస్టిక్ వాడకం వలన వాతావరణంలో కలిగే మార్పులు , నేలకు జరిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం గొప్ప విషయం అన్నారు. ప్రకృతిని కాపాడుకునే భాద్యత ప్రజలందరిపై ఉంటుందన్నారు. మన ఇంటిని శుభ్రంగా వుంచినట్లే పరిసరాలను చూసుకోవాలని అన్నారు.
Also Read:బీట్ రూట్ తో ఎన్ని ఉపయోగాలో..!
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేసినందుకు జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ డిసిపి శ్రీనివాస్, అడిషనల్ డిసిపి ఎం. భీమ్ రావ్, ఏసీపీ ప్రతాప్ , ఎస్ బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మోడెమ్ సురేష్ అడ్మిన్ , మురళి సి.ఫ్ .ఎల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:నేరేడు పండుతో షుగర్ కు చెక్!