మా మధ్య హెల్తీ రిలేషన్‌ ఉంది : దిల్‌ రాజు

33
dill raju
- Advertisement -

కార్తికేయ మూవీ టీంకు తమకు మధ్య హెల్తీ రిలేషన్ ఉందని దిల్ రాజు స్పష్టం చేశారు. టాలీవుడ్‌ నిర్మాతల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉందని కొందరు వ్యూస్‌ కోసం అవాస్తవాలు రాస్తుంటారని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఊహాగానాలు వ్యాప్తి చేసి చిత్ర పరిశ్రమ వారిని బలి పశువులను చేయొద్దని కోరారు. కార్తికేయ2 సక్సెస్‌ మీట్‌లో ఆయన ఎమోషనల్‌గా మాట్లాడారు. సినిమా విడుదల విషయంలో తనపై వచ్చిన వదంతులపై స్పందించారు. సినిమా రిలీజ్ డేట్ మార్చమని తానే ఫోన్ చేసి అడిగానని, అందుకు వారు ఒప్పుకున్నారని చెప్పారు. అయితే బయట మాత్రం ఈ విషయం నెగిటివ్ గా స్ప్రెడ్ అయిందని వాపోయారు.

వాస్తవానికి కార్తికేయ 2 జూలై 22వ తేదీన ప్రేక్షకుల వచ్చేందుకు సిద్ధమైంది. అయితే అదే సమయంలో దిల్ రాజు నిర్మాతగా నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా విడుదలైంది. కార్తికేయ 2 నిర్మాతలు రిలీజ్ కోసం చాలా తిప్పలు పడ్డా.. దిల్ రాజు బలం ముందు వీరి బలగం సరిపోలేదన్న విమర్శలు వచ్చాయి. ఫలితంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కార్తికేయ 2ను మిగతా భాషల్లోనూ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇక ఆగస్టు 12 శుక్రవారం కార్తికేయ 2 రిలీజ్ కు చిత్ర బృందం మరోసారి ముహూర్తం ఖరారు చేసుకుంది. అయితే ఆగస్టు 5న దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బింబిసార రిలీజ్ కాగా.. 12న నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్న నితిన్ మూవీ మాచర్ల నియోజకవర్గం విడుదలైంది. దాంతో కార్తికేయ2 ను మరోరోజు అనగా ఆగస్టు 13న శనివారం నాడు విడుదల చేశారు. దీనికి ముందు భారీ హిట్‌ సినిమాలు ఉండటంతో థియెటర్లు దొరక్క పోవడం వల్లే సినిమాను పోస్ట్‌ పోన్‌ చేశారన్నారు. కానీ దానికి నాకు ఏటువంటి సంబంధం లేదని చెప్పడానికి… కార్తికేయ 2 సక్సెస్ మీట్ కు హాజరైన దిల్ రాజు… తనపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

- Advertisement -