సన్నీ బయోపిక్‌.. రెండవ సీజన్ ట్రైలర్‌

229
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ జీవితం ఆధారంగా కరణ్‌జీత్ కౌర్: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్ అనే సినిమా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. స‌న్నీలియోన్ జీవితంలో ఎదుర్కున్న క‌ష్టాల‌ను, ఆమె పోర్న్ స్టార్‌గా మార‌డానికి గ‌ల కార‌ణాలను ఈ సినిమాలో చూపిస్తున్నారు. అయితే దీన్ని సినిమాలా కాకుండా ఓ వెబ్ సిరిస్‌లా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఈవెబ్ సిరీస్‌లో సన్నీ లియోన్ పాత్ర‌లో రైసా సౌజానీ అనే అమ్మాయి న‌టిస్తున్న విషయం తెలిసిందే. జూలై 16వ తేదీన మొదటి ఎపిసోడ్‌ను రిలీజ్ చేశారు.

Sunny Leone

ఇక ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన రెండవ సీజన్ ట్రైలర్‌ను తాజాగా నిర్మాతలు రిలీజ్ చేశారు. మొదటి సిరీస్‌లో సన్నీ లియోన్ చిన్నతనంలో జరిగిన సంఘటనలను చూపించారు. పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లకముందు.. కరణ్‌జీత్ కౌర్ వోహ్రాగా ఉన్న సన్నీ పాత్రను మొదటి ఎపిసోడ్‌లో చూపించారు. తల్లి, తండ్రి, సోదరుడితో జరిగే సంఘర్షణలను రెండవ పార్ట్‌లో చూపించనున్నారు. డానియల్ వెబర్ తన జీవితంలోకి ఎలా ఎంటర్ అయ్యాడన్న కోణాన్ని కూడా రెండవ సిరీస్‌లో చూపిస్తారు. రెండవ సిరీస్‌లో కరణ్‌జీత్.. సన్నీగా మారుతుంది. దీన్ని ఆదిత్య దత్ డైరక్ట్ చేస్తున్నాడు. సన్నీ టాప్ సెలబ్రిటీగా ఎలా మారిందన్న కోణంలో మొత్తం అయిదు సిరీస్‌లను రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -