వంద కోట్ల క్లబ్‌లో ‘గీత గోవిందం’..

279
Geetha Govindam
- Advertisement -

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బోల్డ్, ఫుల్ యాటిట్యూడ్, అగ్రెసివ్‌గా నటించిన విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాలో తన నటనా వైవిధ్యాన్ని చూపించాడు. సరదాగా, అమాయకంగా కనిపించే పాత్రలో నటించి అందరిని మెప్పించాడు.

Geetha Govindam

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూత్‌కి ఒక రేంజ్‌లో కనెక్ట్ అయింది. విడుదలైన ప్రతి చోటున భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

తొలి అయిదు రొజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆ తరువాత ఈ సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టొచ్చుననీ, 100 కోట్ల వరకూ వెళ్లకపోవచ్చుననే ప్రచారం జరిగింది. కానీ వాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తూ, ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

Geetha Govindam

ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇంతవరకూ 16 కోట్లకి పైగా షేర్‌ను వసూలు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ వారం విడుదలవుతోన్న ‘నర్తనశాల’, ‘పేపర్ బాయ్’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ప్రభావితం చేయలేకపోతే, ‘గీతగోవిందం’ 125 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.

- Advertisement -