డియర్ కామ్రేడ్ రీమేక్ రైట్స్‌ ఎంతో తెలుసా…!

494
dear comrade
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్‌. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌ సంయుక్త‌గా నిర్మించారు. జూలై 26న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కాగా విడుదలైన ప్రతీ చోటా మంచి వసూళ్లను రాబట్టింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా 34.32 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టగా, రూ. 20.70 షేర్‌ని క‌లెక్ట్ చేసింది. తాజాగా ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌.

విజయ్ దేవరకొండతో కలిసి చిత్రాన్ని వీక్షించిన కరణ్ జోహార్‌ ఇదొక గొప్ప ప్రేమ క‌థ‌. మంచి సందేశం ఉందన్నారు. న‌టీన‌టుల‌తో పాటు నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌పై ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాన‌నే విష‌యం తెల‌ప‌డం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అంతేగాదు హిందీ రీమేక్ కోసం క‌ర‌ణ్ జోహార్ రూ.6.2 కోట్లు ఇచ్చి రైట్స్‌ని సొంతం చేసుకున్నాడ‌ట‌.

- Advertisement -